ఓటర్ల జాబితా సవరణలో భాగంగా లక్షలాది ఓట్లను తొలగించిన వైనంపై హైదరాబాద్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా తొలగించిన ఓటర్ల లెక్క హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ప్రముఖ దినపత్రికలో ప్రముఖంగా వచ్చిన ఓటర్ల తొలగింపు వార్తతో లక్షలాది మంది తమ ఓట్ల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని ఆన్ లైన్లో చెక్ చేసుకొని అవాక్కు అవుతున్నారు.
దాదాపు 16 లక్షల మంది ఓట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగింపునకు గురి కావటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా కలిసి ఎన్నికల కమిషన్ కు తాజాగా ఫిర్యాదు చేశారు. ఓటరు జాబితా పరిశీలన వేళలో భారీ ఎత్తున కుట్ర జరిగిందని.. ఎలాంటి పరిశీలన చేయకుండానే ఓట్లను ఇష్టానికి వచ్చినట్లుగా తీసేసినట్లుగా చెబుతున్నారు.
ఓటర్ల జాబితాను సరిదిద్దటంతోపాటు.. జరిగిన అవకతవకల్ని సరిదిద్దాలంటూ ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేతలు విన్నవించారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహానికి గురయ్యేలా చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 లక్షల ఓట్లు తొలగించటం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు.
విభజన చట్టంలో భాగంగా త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగే నేపథ్యంలో.. జనాభా ఆధారంగా ఓటర్ల సంఖ్యను చూసుకొని కొత్త నియెజకవర్గాల్ని ఏర్పాటు చేస్తారు.
అలా ఏర్పాటు చేసే నియోజకవర్గాలు జిల్లాల్లోనే ఉండాలన్న ఆలోచనలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది ఓట్లను తీసేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ కొత్త కోణం ఇప్పుడు సంచలనంగా మారింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే 17.60 లక్షల ఓట్లు తీసేయటాన్ని తప్పు పడుతున్నారు. హైదరాబాద్ లో ఓట్లు తగ్గించి.. జిల్లాల్లో పెంచాలన్న ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉందని చెబుతున్నారు. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా.. విన్నంతనే ఎంతోకొంత లాజిక్ ఉందనిపించేలా ఉన్న ఈ వైనం రానున్న రోజుల్లో మరింత హాట్ టాపిక్ గా మారటం ఖాయమంటున్నారు. మరి.. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై గులాబీదళం రియాక్షన్ ఏమిటో చూడాలి.