ఇది వరకూ ఒకసారి జైలుకు వెళ్లి వచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నేత ఏ.రేవంత్ రెడ్డి. ఇప్పుడైతే ఆయన కాంగ్రెస్ నేత హోదాలో జైలుకు వెళ్లారు కానీ, గతంలో తెలుగుదేశం నేత హోదాలో జైలుకు వెళ్లి వచ్చారు. కొన్ని నెలల పాటు అప్పట్లో రేవంత్ రెడ్డి జైల్లో గడిపారు. చంద్రబాబు తరఫున వెళ్లి ఎమ్మెల్యే ఓటును కొనడానికి డబ్బు సంచులతో వెళ్లి వీడియోల్లో చిక్కారు రేవంత్. దీంతో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి, జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
అలా కొన్ని నెలల పాటు రేవంత్ జైల్లో గడిపినా, బయటకు వచ్చాకా మాత్రం హీరో అయ్యాడు. ఆయనపై కేసులున్నా కాంగ్రెస్ పార్టీ ఆయనను తీసుకుంది. అయితే ఎమ్మెల్యేగా మాత్రం సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓడిపోయారు. జైలు నుంచి బయటకు వచ్చాకా వీరోచిత హీరో అనిపించుకున్నా.. ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కానీ కట్ చేస్తే ఆ వెంటనే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. ఏతావాతా జైలు జీవితం తర్వాత రేవంత్ రెడ్డికి కావాల్సిన ప్రచారం, గుర్తింపు వచ్చింది. అంతకు ముందు పెద్ద నేతలు తరఫున నోట్ల సంచులు మోస్తాడనేపించుకునే స్థాయి నుంచి, రేవంత్ రెడ్డి.. సొంతంగా పెద్ద నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి జైలు పాలయ్యారు. అనుమతి లేకుండా వేరే వాళ్ల ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేసిన వ్యవహారంలో తెలంగాణ సర్కారు రేవంత్ ను మరోసారి జైలుకు పంపింది. అయితే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి జైలు కలిసి వస్తుందనే టాక్ వినిపిస్తోంది ఆయన అనుచవర్గం నుంచి. గతంలో జైలుకు వెళ్లి రేవంత్ రాష్ట్ర స్థాయి నేత అయిపోయారని, ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాకా ఆయనకు కీలక పోస్టు దక్కుతుందని ఆయన అనుచవర్గాలు ఆశాభావంతో ఉన్నారు. ఆ పెద్ద పోస్టు మరేదో కాదు..తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు. ఈ పదవిని ఆశిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను ఏలుతున్న కేసీఆర్ సర్కారు రేవంత్ పై కక్ష గట్టి ఇలా వరసగా జైలుకు పంపుతోందని, ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కీలక పదవి కట్టబెడుతుందని రేవంత్ అనుచవర్గం ఆశాభావం తో ఉంది. మరి వారు భావిస్తున్నట్టుగా.. రేవంత్ రెడ్డికి జైలే మరోసారి కలిసి వస్తుందా?