మధ్యప్రదేశ్ లో రాజకీయం రసపట్టులో ఉంది. అక్కడ మొన్నటి వరకు కాంగ్రెస్ కీలకనేతగా ఉన్నా జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా - తదనంతర పరిణామాలతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీనితో మరోసారి తమ రాజకీయ చాణిక్యతని చాటుకొని మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే ...ప్రభుత్వం కూలిపోకుండా ఉండేదుకు కాంగ్రెస్ వూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో క్యాంప్ రాజకీయాలు మొదలైయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని ఇప్పటికే పార్టీ జైపూర్ కి తరలించింది.
ఇకపోతే, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కి రాజీనామా చేసి - బీజేపీలో చేరిన తరువాత - సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగుళూరులోని ఓ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. బెంగుళూరులోని ఓ రిసార్ట్ లో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు - వారు ఉంటున్న రిసార్ట్ వద్దకి వెళ్లిన మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీని - లఖన్ సింగ్ అనే ఎమ్మెల్యేని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆ రిసార్ట్ వద్ద తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రెచ్చి పోయిన ఆ మంత్రి పోలీసులతో గొడవకు దిగారు. దీనితో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే, తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలని కలుసుకునేందుకు జీతూ పట్వారీని - ఎమ్మెల్యేని పోలీసులు రిసార్ట్ లోపలికి అనుమతించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే తమ రాష్ట్రానికి చెందిన మంత్రులు - ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసిందని, వారిని విడుదల చేయకపోతే తాము కోర్టుకెక్కుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అటు-జీతును పోలీసులు అడ్డుకుంటున్న వీడియో వైరల్ అయింది.