చేతిలో అధికారం ఉంటే చాలు కళ్లు కొందరికి నెత్తికి ఎక్కేస్తుంటాయి. తాజాగా బీహార్ లోని ఒక ఎంపీ తీరు చూస్తే ఇది నిజమనిపించకమానదు. బీహార్ లోని ఒక ఎంపీ కాన్వాయ్ లోని వాహనం సృష్టించిన ఆరాచకం అంతాఇంతా కాదు. ముగ్గురిని బలి తీసుకున్న ఆమె వాహనం.. మరో ఇద్దరి ప్రాణాలతో పోరాడే దుస్థితికి తీసుకొచ్చింది.
సపుల్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రాజన్ కాన్వాయ్ చేసిన బీభత్సం అంతాఇంతా కాదు. సపుల్ లోని నిర్మాలి- సికార్హత ప్రధాన రహదారిలో రంజీత్ రాజన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలంలోనే ముగ్గురు మరనించారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో రంజీత్ రాజన్ తో పాటు.. నిర్మలి బ్లాక్ కాంగ్రెస్ చీఫ్ రామ్ ప్రసేష్ యాదవ్ కూడా ఆమెతోనే ఉన్నారు. కొంతలో కొంత మెరుగైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని తమ వాహనంలో ఎక్కించుకొని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.