కాంగ్రెస్‌ కు అభ్యర్థులు కావలెను

Update: 2019-01-05 10:35 GMT
జాతీయ స్థాయిలో తమ పతాకాన్ని ఎగరవేయాలని తహతహలాడుతున్న కాంగ్రెస్‌ కు తెలంగాణలో మాత్రం చుక్కెదురవుతోంది. ఇటీవల ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో అధికారం ఖాయమని అనుకుంది. ఇందుకోెసం బద్దశత్రువైన తెలుగుదేశంతో కూడా స్నేహం చేసింది. ఈ రెండు పార్టీలు, మరో రెండు పార్టీలతో కలసి మహాకూటమిగా తెలంగాణ బరిలో నిలిచాయి. అయినా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో దారుణ ఓటమిని చవి  చూశాసాయి.

ఈ ఎన్నికలలో మిత్రపక్షాలతో కలసి కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. ముందస్తు ఎన్నికల దెబ్బ నుంచి కోలుకోకుండానే పంచాయాతీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగానే జరుగుతాయి. ఏ రాజకీయ పార్టీ అధికారికంగా తమ అభ్యర్దులను నిలబెట్టవు. అయిన ప్రతీ పార్టీ ఎవరో ఒక అభ్యర్దిని తమ పార్టీకి చెందిన వాడిగా ప్రచారం చేస్తాయి. ఎన్నికల అనంతరం పంచాయితీలో దక్కిన స్దానాలను బట్టి గ్రామాలలో అయా రాజకీయ పార్టీల ప్రభావం ఎంతుందో తేలుతుంది.

ఈ నెలలోనే మూడు విడతలుగా జరగనున్న పంచాయితి ఎన్నికలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సమాయత్తమవుతోంది. ఒక్కో గ్రామంలోను సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్దిత్వం కోసం అధికార తెరాసలో తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సగానికి పైగా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్దులే కరువయ్యారటా. పైకి పంచాయితీ ఎన్నికలుగా కనబడుతున్నా లోపాల మాత్రం ఇవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గ్రామాల పై తమ పట్టు ఉండాలంటే పంచాయితి ఎన్నికలలో గెలుపు తప్పనిసరి. ఇందుకోసం పోటీ చేసే అభ్యర్దులు ఖర్చుకు వెనుకాడటం లేదు. శాసనసభ ఎన్నికలలో కుదేలైన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు ఆసక్తి కనబర్చటం లేదు.

డబ్బులు ఖర్చు చేసినా గెలుస్తామనే ధీమా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిల్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదంటున్నారు. పైగా పార్టీలకి అతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి, ఎన్నికల అనంతరం, గెలిచిన అనంతరం సర్పంచ్‌లు అధికార పార్టీ వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో పంచాయితి ఎన్నికలలో పోటీ పట్ల కాంగ్రెస్ అధిష్టానం కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ వారిగా చెప్పుకునేందుకు గ్రామాలలో నాయకులే కరువయ్యారు. ఈ పంచాయితి ఎన్నికలలో కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటన్నారు.




Full View
Tags:    

Similar News