రాహుల్ ను వదిలితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తా.?
మోడీ ఇప్పుడు దేశంలోనే బలవంతుడు. బీజేపీని ఒంటిచేత్తో రెండు సార్లు దేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన ధీరుడిగా మిగిలిపోయాడు. 2014, 2019లో మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మోడీని ఎదురించే ధీరుడు ఎవ్వరూ అనే ప్రశ్న దేశంలో చర్చనీయాంశమైంది.
మోడీని ఎదురించాలని కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ వచ్చాడు. మోడీపై రాఫెల్ కుంభకోణం సహా ఆయన పాలనలో జరిగిన అవినీతి, అసమర్థతను ఎత్తి చూపాడు. రైతులకు ఏం చేయని మోడీ చేతకానితనాన్ని మూడు హిందీ రాష్ట్రాల్లో ఎండగట్టాడు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను గద్దెదించడంలో విజయం సాధించాడు. కానీ అది రాహుల్ సామర్థ్యం కాదని.. అక్కడి బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకతే కారణమని తాజా ఫలితాలతో వెల్లడైంది..
*రాహుల్ ఎగ్జిట్.. విడవచ్చు కదా..
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రెండోసారి కూడా మోడీ చేతిలో ఓడిపోవడంతో ఇక తాను అన్ ఫిట్ అని .. వేరే వాళ్లకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని రాజీనామా చేశారు. వెంటనే వేరే అధ్యక్షుడిని నియమించాలని తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని సీడబ్ల్యూసీపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సోనియా గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రాహుల్ రాజీనామా ఆమోదించడం లేదు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరినా రాహుల్ మాత్రం బెట్టు వీడడం లేదు. అయితే రెండు సార్లు రాహుల్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. పప్పూ అని ఇప్పటికే బీజేపీ రాహుల్ నాయకత్వంపై ఎద్దేవా చేస్తోంది. దేశ ప్రజలు కూడా రాహుల్ ను నమ్మకుండా ఈసారి ఓటేయలేదు..
*మోడీకి సరితూగే నాయకుడు కాంగ్రెస్ కు అవసరం
రెండు సార్లు బలమైన మోడీతో పోటీపడ్డ రాహుల్ ను ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారు. అందుకే రాహుల్ రాజీనామా చేశారు. అందుకే ఇప్పుడు రాహుల్ ను పక్కనపెట్టి కాంగ్రెస్ వేరే వ్యక్తిని రంగంలోకి దింపితే ఫలితాలు సాధించవచ్చు. సీనియర్ కానీ జూనియర్ కు కానీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. లేదంటే మరో ఐదేళ్లకు కూడా మోడీని తట్టుకొని రాహుల్ నిలబడడం కష్టమంటున్నారు.
*థర్డ్ ఫ్రంట్ బలపడొచ్చు..
రాహుల్ ను మార్చకుండా కాంగ్రెస్ ఇలానే ముందుకెళితే ఆ పార్టీ పుట్టి మునగడం ఖాయం. అందుకే ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది. లేదంటే వచ్చే ఎన్నికల నాటికి దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయంగా థర్డ్ ఫ్రంట్ రావచ్చు. కేసీఆర్ సహా మమతా, అఖిలేష్, మాయ ఎవరైనా నాయకుడు ఫోకస్ కావచ్చు. అందుకే కాంగ్రెస్ రాహుల్ ను వదిలి రాజకీయంగా సత్తా చాటుకున్న వారిని చూసుకుంటే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.