స్థానికతపై తూచ్ అన్న కేసీఆర్

Update: 2015-11-18 07:41 GMT
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రయోగించిన స్థానికత అంశం వికటించిందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వరంగల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టీఆరెస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఒక్కరే స్థానికుడు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే స్థానికుడు కాకపోగా... బీజేపీ అభ్యర్థి దేవయ్య వరంగల్ జిల్లావాసే అయినా మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైజ దీంతో వారిద్దరూ స్థానికులు కాదు కాబట్టి స్థానికంగా ఉండే తమ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ కే ఓటు వేయాలని టీఆర్ ఎస్ మొదట్లో ప్రచారం చేసింది. అయితే.... కాంగ్రెస్ పార్టీ టీఆరెస్ వ్యూహాన్ని తిప్పికొట్టడంతో ఆ పార్టీ ఇబ్బందిలో పడుతోంది. దీంతో స్థానిక టీఆరెస్ నేతలు ఈ వ్యూహం అనుసరించకపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు మథన పడుతున్నారట.

కాంగ్రెస్ అభ్యర్థి సర్వే స్థానికుడు కాదని టీఆరెస్ ప్రచారం చేయడంతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ రావు, కవిత ల్లో ఒక్కరైనా తమ సొంత ప్రాంతాల నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారా...? వారు ఆయా నియోజకవర్గాలకు స్థానికేతరులు కాదా అని గట్టిగా అడ్డుతగలడం ప్రారంభించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ - మహబూబ్ నగర్ - గజ్వేల్ లో ఎలా పోటీ చేశారని ప్రశ్నిస్తున్నారు. తాము ఎక్కడ పోటీ చేసినా చెల్లుబాటవుతుందని… దళిత నేతలకు మాత్రమే స్థానికత ఉండాలని అన్నట్టు టీఆర్ ఎస్ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. దీంతో… ఇకపై స్థానికత అంశాన్ని వరంగల్ ఎన్నికల్లో ప్రచారాస్త్రాంగా వాడుకోవద్దని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తమ మంత్రులకు, పార్టీ నేతలకు గట్టిగా చెప్పినట్టు సమాచారం. మరి… రోజు రోజుకూ టఫ్ ఫైట్ గా మారుతున్న వరంగల్ ఉప పోరులో గులాబీ పార్టీ ఎలాంటి ఫలితం వస్తుందన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
Tags:    

Similar News