టీడీపీకి కాంగ్రెస్ దెబ్బ‌- రెబ‌ల్‌ కు మ‌ద్ద‌తు!

Update: 2018-12-07 05:04 GMT
కాంగ్రెస్ అధికారికంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీకి కేటాయించిన సీటులో కాంగ్రెస్ రెబ‌ల్ అభ్య‌ర్థికి ఓటు వేయమ‌ని గురువారం అర్ధ‌రాత్రి అధికారికంగా ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. దీంతో మ‌హాకూట‌మిలో అవ్య‌వ‌స్థ‌ - కాంగ్రెస్ రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌చ్చింది. జ‌న‌ర‌ల్‌గా వెన్నుపోటు ముద్ర ఉన్న చంద్ర‌బాబుకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడ‌వ‌డం అవాక్క‌య్యే విష‌య‌మే.

ఇంత‌కీ ఈ క‌ల‌క‌లానికి కార‌ణం ఏంటి?  కాంగ్రెస్ సార‌థ్యంలోని ప్ర‌జా కూట‌మి ఇబ్ర‌హీం ప‌ట్నం టిక్కెట్‌ ను తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. దీంతో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన మ‌ల్‌ రెడ్డి రంగారెడ్డి రెబ‌ల్ అభ్య‌ర్థిగా బీఎస్పీ త‌ర‌ఫున పోటీ చేశారు. టీడీపీ అభ్య‌ర్థి సామ‌రంగారెడ్డి ప్ర‌జాకూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. అయితే, కాంగ్రెస్ శ్రేణులు సామ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గడువు ముగిశాక మ‌ల్‌ రెడ్డి రంగారెడ్డికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఆయ‌న త‌ర‌ఫునే ప్ర‌చారం చేశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. వ‌చ్చే సీటు పోతుందేమో న‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పోలింగ్‌ కు ఒక్క రోజు ముందు మ‌ల్‌ రెడ్డి రంగారెడ్డికే మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో ఇలా ఉంది... ``ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ కూటమి మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు - నాయకులు మల్‌ రెడ్డి రంగారెడ్డి కే మద్దతు ఇచ్చి పనిచేయాలి`` అని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి.
Tags:    

Similar News