‘బాహుబలి’ ఎఫెక్ట్ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయాల్లో సైతం ‘బాహుబలి’ ప్రస్తావన మామూలైపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బాహుబలి ప్రస్తావన తెచ్చాడు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత జానా రెడ్డి కొన్ని నెలల కిందట మాకోసం ఒక బాహుబలి వస్తాడంటూ చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశమే అయింది. ఎవరా బాహుబలి అంటూ ఆ పార్టీలో.. మీడియాలో డిస్కషన్ నడిచింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానే ఆ బాహుబలి అన్నట్లుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో మరికొందరు నేతలు కూడా ‘బాహుబలి’ కావాలని ఆశపడ్డారు. ఐతే ఇప్పుడు ఊహించని విధంగా మరో‘బాహుబలి’ తెరమీదికి వచ్చాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) అగ్రనేతల్లో ఒకరైన హరీష్ రావులో కాంగ్రెస్ పార్టీ తమ బాహుబలిని చూసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తర్వాత టీఆర్ ఎస్ లో అంత పెద్ద నేత అయినప్పటికీ.. హరీష్ రావుకు ఈ మధ్య ఆ పార్టీలో తగినంత ప్రాధాన్యం దక్కట్లేదన్నది వాస్తవం. తన కొడుకు కేటీఆర్.. కూతురు కవితలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కేసీఆర్. వాళ్లిద్దరూ కూడా పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా కీలక పాత్ర పోషిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వైఖరి పట్ల హరీష్ అసంతృప్తితో ఉన్నాడంటున్నారు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆశపడుతున్నారు. మెల్లగా హరీష్ రావును దువ్వే ప్రయత్నం కూడా చేస్తున్నారట కొందరు నేతలు. ప్రస్తుతం టీఆర్ ఎస్ లో పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ వారసత్వాన్ని అందుకుని.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు హరీష్ కు ఎంతమాత్రం లేవని.. అదే తమ పార్టీలోకి వస్తే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. హరీష్ కు ఈ ఆశ చూపి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఐతే మేనమామ విషయంలో ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ హరీష్.. పార్టీని వదిలేసి కాంగ్రెస్ లోకి వచ్చే సాహసం చేస్తారా అన్నది సందేహం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/