కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ నెల పదిన భారత్ జోడో(భారత సమైక్య) యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. ప్రస్తుతం ఇది కేరళ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.
అయితే.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చాలా చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ జడ్ + కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఎందుకంటే.. తన తండ్రి రాజీవ్ హత్య అనంతరం.. గాంధీల కుటుంబానికి.. కేంద్రం జడ్ + భద్రత కొనసాగిస్తోంది. సో.. ఆయన ఈ కేటగిరీలోనే భద్రత పొందుతున్నారు.
అయితే.. జోడో యాత్రలో మాత్రం.. ఈ జడ్ + భద్రతను కూడా పక్కన పెట్టి ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారు. తనను చూసేందుకు వస్తున్నవారితో ఎలాంటి భయం లేకుండా కలుస్తున్నారు. బారికేడ్ల పక్కన నిరీక్షిస్తున్నవారి దగ్గరకు వెళ్లి మరీ పలకరిస్తున్నారు. అంతేకాదు.. తన వెంట నడిచేవారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల నుంచి.. ఇతర వర్గాల వరకు అందరినీ కలుపుకొని పోతున్నారు. దీంతో రాహుల్ యాత్ర ప్రత్యేకంగా మారింది. ఆదివారం.. ఓ చిన్నారి.. రాహుల్ వెంట నడిచింది. ఈ క్రమంలో ఆ చిన్నారి పాదరక్షలకు ఉన్న బెల్ట్ ఊడిపోయింది. దీంతో రాహుల్ స్వయంగా కిందకి వంగి.. బెల్ట్‌ను సరిచేశారు.
ఈ వీడియో.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. రాహుల్ నిగర్వి అంటూ.. పెద్ద ఎత్తున సానుకూల కామెంట్లు వచ్చాయి. ఇక, కేరళలో ఆయన పడవ ప్రయాణం మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతం అళప్పుజ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ స్థానికంగా.. జరుగుతున్న ఓనం వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేరళ వాసులకు ఎంతో ఇష్టమైన పడవ పందాల్లో పాల్గొన్నారు. తాను కూడా తెడ్డు పట్టుకుని.. నీటినీ ఎగదన్నుతూ.. పడవలో ముందుకు సాగిన దృశ్యం నెటిజన్లు భారీ ఎత్తున ఆకట్టుకుంటోంది.
భారత్ జోడో యాత్రలో చోటు చేసుకున్న ఈ `జల యాత్ర` నయనానందకరంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు.. రాహుల్ స్థానికంగా ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. కాంగ్రెస్ నాయకులు.. వివరణ ఇచ్చారు. మరి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.