తనకు తిరుగే లేదన్నట్లుగా చెలరేగిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఒకప్పుడు అధికారపక్షంగా హవా నడిపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క విజయం చాలన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి మారింది. సాధారణంగా అధికారపక్షంపై ఉండే వ్యతిరేకత విపక్షాలకు అంతో ఇంతో మేలు చేస్తుంది. అందుకు భిన్నంగా తాను పవర్లో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకతను భిన్నంగా భారీ ప్రజామోదంతో బీజేపీ దూసుకెళుతుంటే.. కాంగ్రెస్ కిందామీదా పడుతోంది.
పేరుకు జాతీయ పార్టీ అనే కానీ.. ఆ పార్టీకి సరైన రథసారధి లేని పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ తన పదవికి రాజీనామా చేయటం.. ఆ పదవిలో మరెవరూ లేకుండా ఖాళీగా ఉండటం.. చివరకు సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టటం తెలిసిందే. ఆరోగ్య పరిస్థితి సరిగా లేని సోనియా.. కాంగ్రెస్ పగ్గాల్ని తిరిగి ఇచ్చేయాలన్న యోచనలో ఉన్నారు.
ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. తిరిగి పార్టీ పగ్గాల్ని కొడుకు రాహుల్ గాంధీకి అప్పజెప్పటం ఖాయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బాధ్యతల్ని చేపట్టాల్సిందిగా రాహుల్ ను కోరనున్నట్లు చెబుతున్నారు. తన చేతిలో పార్టీ పగ్గాలు ఉన్నా లేకున్నా పార్టీకి ఓటమి తప్పని నేపథ్యంలో.. కాస్త యాక్టివ్ గా ఉంచేందుకైనా రాహుల్ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించక తప్పదంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని అధిక్యం కనపర్చిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మరింత డీలా పడిపోవటం ఖాయం. వరుస ఓటములతో నిలువెత్తు నిరుత్సాహంలో మునిగిన పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు రాహుల్ కు మించిన ప్రత్యామ్నాయం ఆ పార్టీకి లేదంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో పార్టీ పగ్గాల్ని రాహుల్ కు మరోసారి అందజేస్తారంటున్నారు. యూపీ పార్టీ పగ్గాల్ని ప్రియాంక పూర్తిస్థాయిలో చేపట్టటంతో పాటు.. యూపీలో తన మార్క్ చూపించి.. అక్కడ విజయం తర్వాతే జాతీయ పార్టీ పగ్గాల్ని స్వీకరిచేందుకు ముందుకు వస్తారని.. అప్పటివరకూ ఆమె యూపీకే పరిమితమవుతారని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు రాహుల్ కు మించిన దిక్కు మరెవరూ లేరని చెప్పక తప్పదు.