కాంగ్రెస్ సీనియర్ నేత.. తెలంగాణ పెద్దాయన జైపాల్ రెడ్డి (77) అంత్యక్రియలపై నెలకొన్న కన్ప్యూజన్ తొలగిపోయింది. క్లారిటీ వచ్చేసింది. రాజకీయంగా ఎన్నో కీలక పదవుల్ని చేపట్టిన జైపాల్ రెడ్డికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జైపాల్ రెడ్డికి ప్రభుత్వమే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరారు.
ఇదే తరహా వినతులు పలువురు నేతల నుంచి వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని కేసీఆర్ ఆదేశించారు.
సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ లోని జైపాల్ రెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సందర్శకుల కోసం గాంధీభవన్ లో ఆయన పార్థీవదేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ అక్కడ ఉంచిన అనంతరం.. అంతిమయాత్ర మొదలవుతుంది. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లుగానే పీవీ ఘాట్ పక్కనే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.