సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా సంఘటనల ఆధారంగా వీడియో వైరల్ చేసేస్తున్నాయి. అయితే ఇందులో మార్ఫింగ్ వీడియోల పాత్ర కూడా ఎక్కువే. తాజాగా కాంగ్రెస్ మరో వీడియోను ఇలాగే మార్ఫింగ్ చేసి వదిలింది. అలా చేసింది ఎవరిపై అంటే...బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత యోగి ఆదిత్యానాథ్ ఇరకాటంలో పెట్టేందుకు. ఆ పార్టీ రథసారథి, ప్రధాని నరేంద్ర మోడీని ప్రస్తావిస్తూ వీడియో వైరల్ చేసింది.
ఇంతకీ కాంగ్రెస్ వీడియోలో ఏముందంటే...ఉత్తరప్రదేశ్ లో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పలు అంశాలను ప్రస్తావిస్తూ మార్ఫింగ్ చేశారు. మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి.. అనే దానిని మధ్యలో ఆపేసి చెడు ప్రభుత్వం ఎలా ఉండాలి? మంచి ప్రసంగం ఎలా చేయాలి అని పేర్కొంటు దానిని మధ్యలో ఆపేసి, విద్వేష ప్రసంగం ఎలా చేయాలి? సోషల్ హార్మీని ఎలా అంటూ దానిని మధ్యలో ఆపేసి, డిస్ హార్మోనీ ఎలా అని అందులో పేర్కొన్నారు. క్రిమినల్స్‌ను ఎలా బయటకు తీసుకు రావాలి? అని కూడా పేర్కొంది.
అయితే ఇక్కడితోనే ఆపివేయకుండా....మోడీని 2019లో ప్రధానిగా ఎలా చేయాలి అనే దానిని మధ్యలో ఆపేసి.. యోగిని ప్రధాని ఎలా చేయాలి అనే దానిని యోగి ఆదిత్యనాథ్ వెతుకుతున్నట్లుగా కాంగ్రెస్ వీడియో మార్ఫింగ్ ఉంది. అయితే ఈ వీడియోపై బీజేపీ మండిపడింది. ప్రజల్లో అభిమానం సంపాదించుకోలేని కాంగ్రెస్ లేనిదాన్ని ఉన్నట్లుగా భ్రమింపచేయడంలో బిజీగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఆర్మీతో పోస్టులు పెట్టించింది.