సచిన్ పైలట్‌ కు కాంగ్రెస్ భారీ షాక్ ... డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవీ నుంచి తొలగింపు !

Update: 2020-07-14 12:00 GMT
రాజస్థాన్ రాజకీయం చివరి అంకానికి చేరుకుంది.  గత రెండు రోజులుగా రసవత్తకరంగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ పరిస్థితులని నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ‌పై తిరుగుబాటు చేసిన ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.  రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి  సచిన్ పైలట్ ను తప్పించింది. గత రెండు రోజుల్లో జరిగిన రెండు  సీఎల్పీ సమావేశాలకి పైలట్, అతని సన్నిహతులు హాజరుకాలేదు. నిన్న గెహ్లట్ నివాసంలో కూడా సీఎల్పీ భేటీ జరిగింది. సమస్యను పార్టీలో చర్చించాలని పైలట్‌ను పదే పదే కాంగ్రెస్ పార్టీ కోరింది.  అయితే ఎంతకీ సచిన్ వెనక్కి తగ్గకపోవడంతో పార్టీకి సరైన మద్దతు ఉందని చెక్ చేసుకున్న తరువాత పైలట్, అతని సన్నిహితులని పదవుల నుండి తొలగించింది.

ఫైలెట్ స్థానంలో గోవింద్ సింగ్‌ ను రాజస్తాన్ పీసీసీ చీఫ్‌గా నియామించారు.  దీంతో కాంగ్రెస్ పార్టీతో సచిన్ పైలట్ బంధం దాదాపుగా ముగిసినట్టయ్యింది.  అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం, అహ్మద్ పటేల్ వంటి కాంగ్రెస్ దిగ్గజాలంతా కలిసి సచిన్ పైలట్‌కు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయితే సచిన్ పైలట్ మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోవైపు అశోక్ గెహ్లాట్‌ వైపు ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు... సచిన్ పైలట్‌పై చర్యలు తీసుకోవాలని సీఎల్పీలో తీర్మానం చేశారు. దీంతో సచిన్ పైలట్‌ను కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. మంత్రులు, పైలట్‌పై వేటు పడగా... ఎమ్మెల్యేలపై అలోచించి  నిర్ణయం తీసుకునే అవకాశం కనిస్తుంది.
Tags:    

Similar News