మోడీపై జోక్ వేస్తే జ‌నాలు భ‌లే క‌నెక్ట్ అయ్యారే!

Update: 2018-08-20 07:09 GMT
ఔను. నిజంగా నిజం. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తే...దానికి జ‌నాలు ఓ రేంజ్‌ లో క‌నెక్ట‌య్యారు. స‌రిగ్గా మాకు వ‌స్తున్న సందేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపింద‌ని పేర్కొంటున్నారు. ఇంత‌కూ ఇది దేని గురించి అంటే...కేంద్ర ఆర్థిక శాఖ గురించి. గ‌త కొద్దికాలంగా కేంద్ర ఆర్థిక శాఖ విష‌యంలో జ‌నాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్థిక‌మంత్రిగా సీనియ‌ర్ బీజేపీ నేత అరుణ్‌ జైట్లీనే పేర్కొంటున్న కేంద్రం ఆ శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ మ‌రో నాయకుడు పీయూష్ గోయ‌ల్‌ తో కానిచ్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీల‌క‌మైన జీఎస్టీ వ్య‌వ‌హారాలు మొద‌లుకొని ఇత‌ర అంశాలు కూడా గోయ‌ల్‌ తో న‌డిపించేస్తున్న నేప‌థ్యంలో అస‌లు మంత్రి ఎవ‌ర‌నే అనుమానం స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఇలా వివిధ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ ఆర్థిక‌మంత్రి పీ చిదంబరం అనూహ్య‌మైన ట్విస్ట్ జోడించారు. జాతీయ గణాంకాల కమిషన్ గత జీడీపీ వివరాలపై శుక్రవారం నివేదికను బహిర్గతం చేసిన నేపథ్యంలో చిదంబరం కేంద్రంపై విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో 8.87 శాతం - 7.39 శాతం జీడీపీ నమోదైందని చిదంబరం గుర్తుచేశారు. అయితే, మోడీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిత్వశాఖ పనితీరు గందరగోళంగా ఉందని ఆయ‌న ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ముగ్గురు ఆర్థిక మంత్రులు ఉన్నారన్నారు. తెర వెనుక మంత్రి (మోడీ) - అధికారిక మంత్రి (పీయూష్ గోయల్) - అనధికారిక మంత్రి (అరుణ్ జైట్లీ) అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అత్యుత్త‌మ ఫ‌లితాలు ఆశించ‌గ‌ల‌డం ఎలా సాధ్య‌మ‌ని ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ జైట్లీ వ్యాఖ్యానించారు.

ఇలా ఉండ‌గా త‌మ‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. జీడీపీ గణాంకాలపై యూపీఏ విధానాలు ఆర్థిక అస్థిరతను ప్రోత్సహించాయని ఫేస్‌ బుక్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ద్రవ్య నియంత్రణపై యూపీఏ ప్రభుత్వం రాజీ పడిందని - నిర్లక్ష్యంగా రుణాలివ్వడంతో బ్యాంకింగ్ వ్యవస్థ చిక్కుల్లో పడిందని పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ జాతీయ గణాంకాల కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని చెప్పారు.

Tags:    

Similar News