కర్ణాటక రాష్ట్రంలో మూడురోజుల క్రితం నగర - పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. అయితే ఈ క్రమంలో గెలుపు ఓటములను మించిన ఆసక్తికర ఘటన మీడియాను ఆకర్షించింది. తుముకూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్ 16వ వార్డు నుంచి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇనాయతుల్లా విజయాన్ని అభినందిస్తూ భారీగా విజయోత్సవ ర్యాలీని తీశారు. అయితే, ఈ ర్యాలీలో యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 లోకల్ బాడీలకు ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి. 29 మున్సిపాలిటీలు - 53 పట్టణ మున్సిపాలిటీలు - 23 పట్టణ పంచాయతీలు - మూడు సిటీ కార్పొరేషన్ లలోని 135 వార్డులను కలుపుకొని మొత్తం 2,664 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తుముకూరులో గెలుపొందిన ఇనాయతుల్లా తన విజయోవత్సవ ర్యాలీ తీస్తున్న క్రమంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తుముకూరు సిటీలో మొత్తం 35 వార్డులుండగా,, బీజేపీ 12 వార్డులు - కాంగ్రెస్ 10 - జేడీఎస్ 10 వార్డుల్లో గెలిచింది. మరో మూడు స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View