నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన రోడ్ షో.. బహిరంగ సభ సందర్భంగా.. తొక్కిసలాట జరి గి .. 8 మంది మృతి చెందడం, మరికొందరు గాయపడడం తెలిసిందే. అయితే.. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని .. తాజాగా టీడీపీ అదినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్దేశ పూర్వకంగానే కందుకూరులో పోలీసులు.. సహాయ నిరాకరణ పాటించారని..తద్వారానే ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు.
ఇక, కుప్పం పర్యటనలో తనను కావాలని అడ్డుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. గతంలోనూ కుప్పం లో పర్యటించేందుకు అనేక ఆంక్షలు పెట్టారని అన్నారు. ఈ మేరకు ఓ చానెల్‌తో మాట్లాడిన చంద్రబాబు తన పర్యటనలు.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు. కందుకూరులో జనాభా వస్తారని తెలిసినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదన్నారు. కేవలం 50 మందిని పంపించి చేతులు దులుపుకొన్నారని వ్యాఖ్యానించారు.
"పోలీసులు ఏం చేస్తున్నారు... గాడిదలు కాస్తున్నారా? శాంతి భద్రతలను కాపాడటం వారి డ్యూటీ. అక్కడ చేసింది కుట్ర రాజకీయాలు. వేల మంది ప్రజలు వస్తున్నప్పటికీ పోలీసులు శ్రద్ధ పెట్టలేదు" అని చంద్ర బాబు నిప్పులు చెరిగారు. ఆ రోజు కందుకూరులో కనీసం 100 మందినైనా పెట్టి ఉండొచ్చు కదా? అని నిలదీశారు.
కానీ, తన పర్యటనను అడ్డుకునేందుకు మాత్రం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారని వ్యాఖ్యానిం చారు. అయినప్పటికీ.. తన పర్యటన ముందుకు సాగుతుందని తెలిపారు. కుప్పం తన సొంత నియోజకవ ర్గం అని, తనకు ఓట్లేసిన వారిని కలుసుకునే హక్కు తనకు ఉంటుందని పేర్కొన్నారు. తాము అధికారం లోకి వచ్చాక కుట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.