చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది. తాజాగా జరిగిన ఎన్నికలలో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం తో అధినేతని పట్టించుకునే నాధుడే కరువైపోతున్నారు. గతంలో చంద్రబాబు చుట్టూ తిరిగిన చాలామంది ఇప్పుడు ఆయన్ని కలవడానికి కూడా ఇష్ట పడటంలేదు. దీనితో పాటుగా టీడీపీ ఎంపీలు బీజేపీ గూటికి చేరిపోయారు. అలాగే మరికొంతమంది కీలక నేతలు ..పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బాబు తన ప్రణాళికలు అమలు చేస్తూ ..జిల్లాల వారీగా నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కానీ , కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్‌గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు ఈ సమావేశానికి రాలేదు. అలాగే కోడుమూరు నియోజక వర్గ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లి పోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా పనిచేసిన వీరభద్ర గౌడ్ కూడా రాలేదు.
మొదట నందికొట్కూరు నియోజకవర్గం పై సమీక్షించారు. బండి జయరాజు గైర్హాజరు కావడంతో అది మాండ్ర శివానందరెడ్డి చూసుకున్నారు. అనంతరం కోడుమూరు సమీక్ష జరగ్గా.. రామాంజనేయులు హాజరు కాలేదు. గతంలో ఇక్కడ ఇన్‌చార్జ్ గా వ్యవహరించిన డి.విష్ణువర్ధన్ రెడ్డి హాజరైనప్పటికీ కోట్ల వర్గానికి, తన వర్గానికి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ను డిమాండ్ చేశారు. ఇందుకు సోమిశెట్టి ఒప్పుకోకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన నేతలను విస్మరిస్తారా అంటూ విష్ణు తన మద్దతు దారులతో కలిసి అలిగి వెళ్లి పోయారు. దీంతో సమీక్ష లో కోట్ల చక్రపాణిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. సమీక్షల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి.. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండక పోతే వెనుకబడి పోతామని అన్నారు. ఎప్పటినుండైనా క్రమం తప్పకుండా నియోజకవర్గాల్లో ప్రజలకి అందుబాటులో ఉండాలని బాబు వారికి చెప్పినట్టు సమాచారం.