పెద్దనోట్ల రద్దు నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదన్నట్లుగా చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. అంతేకాదు.. ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోలేదని.. దాని మీద భారీ కసరత్తు జరిగిందన్న మాటను చెప్పారు. రాజ్యసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా జైట్లీ సభ్యులకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని గత ఏడాది ఫిబ్రవరిలోనే తీసుకున్నామని.. రిజర్వ్ బ్యాంకు ఉన్నతాధికారులు.. ప్రభుత్వం మధ్య వరుస సంప్రదింపులు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొనటం గమనార్హం.
నవంబరు 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో పది మంది ఆర్ బీఐ బోర్డులో ఎనిమిది మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అంతేకాదు.. పెద్దనోట్లను రద్దు చేసే నేపథ్యంలో రద్దు చేసే నోట్ల స్థానంలో కొత్త నోట్లను ముద్రించేందుకు సంప్రదింపులు మొదలయ్యాయని.. ఆ నిర్ణయాన్ని గత మేలోనే తీసుకున్నట్లుగా వెల్లడించారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక.. ఆర్ బీఐ.. ప్రభుత్వం మధ్య వారానికి ఒకసారి చర్చలు జరిగినట్లుగా వెల్లడించిన జైట్లీ.. ఈ వరుస సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు.. ఆర్ బీఐ ఉన్నతాధికారులు పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్ బీఐ సొంతంగా నిర్ణయం తీసుకుందా? ప్రభుత్వం చెబితే తీసుకుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. రద్దు అంశాన్ని ఆర్ బీఐ బోర్డులో పరిశీలించాలని.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా సమాచారాన్ని పంపిందన్నారు.
ఆర్ బీఐ ఆ విషయాన్ని స్వతంత్రంగా పరిశీలించి.. సొంతంగా ఆలోచించి.. ప్రభుత్వానికి సిఫార్సుచేసినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా జైట్లీ మాటల్ని చూసినప్పుడు.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం ఎంతమాత్రం కాదన్న విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించటం కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే.. పెద్దనోట్ల రద్దు స్థానంలో కొత్త నోట్లనుముద్రించాలని అనుకున్నప్పుడు.. ప్రింటింగ్ ఆలస్యం ఎందుకైంది? జనాలకు ఏటీఎం కష్టాలు ఎందుకంత భారీగా చోటు చేసుకున్నాయి? ఇదంతా కూడా వ్యూహాత్మకంగా సాగిన వ్యవహారమా? అన్న దానిపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/