సంచలనం: కోర్టు ధిక్కరణ..ఇద్దరు ఐఏఎస్ లకు జైలు

Update: 2021-06-22 11:43 GMT
కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఏపీ ఐఏఎస్ లకు షాక్ తగిలింది. కేసులో తీర్పు అమలు చేయనందుకు ఏకంగా హైకోర్టు జైలు శిక్ష పడింది. ఈ తీర్పు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.కోర్టు ధిక్కరణ అంశంలో ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.  ఐఏఎస్ లు చిరంజీవి, గిరిజా  శంకర్ కు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

36మంది  ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్ లో హైకోర్టు సంబంధిత అధికారులైన చిరంజీవి, గిరిజా శంకర్ ను అదేశించింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వాటిని అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో చిరంజీవి, గిరిజా శంకర్ కు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Tags:    

Similar News