భారత్ గొప్ప దేశం కాదు: మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2021-05-28 16:51 GMT
కాంగ్రెస్ సీనియర్ నేతలకు వృద్ధాప్యం మీదపడ్డాక ఏం అంటున్నారో.. ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వేళ మోడీ సర్కార్ పై విమర్శల పేరుతో సొంత దేశాన్ని అవమానిస్తున్న నేతల తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

భారత్ వేరియంట్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించడం దుమారం రేపుతోంది. బీజేపీ దీనిపై ఇప్పటికే తప్పుపట్టింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లకు ఆ పదాలు తొలగించాలని ఆదేశాలిచ్చింది.కాగా తాజాగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని.. అపఖ్యాతి పాలైందని వ్యాఖ్యానించారు.

భారత ప్రజలపై అన్ని దేశాలూ నిషేధం విధించాయని.. అందుకే కేంద్రమే బాధ్యత వహించాలని కమల్ నాథ్ డిమాండ్ చేశారు. 'భారత్ గొప్ప దేశం కాదని నేనంటున్నాను. భారత్ అపఖ్యాతి పాలైంది.  భారత పౌరులపై అన్ని దేశాలు నిషేధం విధిస్తున్నాయి' అని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News