నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ, తెలంగాణ మధ్య పంచాయితీ మొదలైంది. డ్యామ్ పై రాకపోకల విషయంలో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల పోలీసులు ఈ డ్యాంపై కొట్టుకోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా మళ్లీ అలాంటి ఘటననే జరిగింది. మంగళవారం రాత్రి నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఫైటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
నాగార్జునసాగర్ డ్యాంపైకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రైట్ బ్యాంక్ ఎస్ఐ ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే అనుమతి లేదంటూ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత డ్యామ్ పైకి ప్రాజెక్టు అధికారులు తప్ప ఇతరులు ఎవరినీ అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.
అయినా వినకుండా డ్యాంపైకి వచ్చేందుకు యత్నించిన ఏపీ ఎస్ఐని తెలంగాణ ఎస్.పీఎప్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ పోలీసుల వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. జరిమానా విధించారు. ఈ రెండు ఘటనలతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ జరిగింది. కొందరు పోలీసులు కొట్టుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
విషయం తెలిసిన ఏపీ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు గొడవ జరిగిన విషయం బయటకు రాకుండా రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ డ్యామ్ ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఏపీలోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో ఉంది. ఏపీ విభజన తర్వాత ఇక్కడ ఏపీ, తెలంగాణ మధ్య అప్పుడప్పుడు విభేదాలు చోటుచేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు.
2015లో కూడా నాగార్జున సాగర్ నీటి కోసం జలవివాదం చెలరేగి ఇరురాష్ట్రాల పోలీసులు డ్యాంపైనే కొట్టుకున్నారు. రణరంగంగా మారింది. ఎస్పీల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోసారి అలాంటిదే పునరావృతమైనట్టు తెలుస్తోంది.