కరోనా టెస్టులు చేసేందుకు వెళ్తే తన్ని తరిమారు..ఇంతకూ ఏమైందంటే?

Update: 2021-05-19 01:30 GMT
దేశంలో కరోనా విరుచుకుపడుతున్నది. కరోనా కేసులు  తగ్గించేందుకు ప్రభుత్వాల దగ్గర ఉన్న మార్గం.. టీటీటీ ( ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్​మెంట్​). దీంతో వివిధ రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు పెంచుతున్నారు. లక్షణాలు ఉన్నవాళ్లకు వెంటనే చికిత్స ప్రారంభిస్తున్నారు. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు చేస్తున్నది. ఈ క్రమంలో ఓ గ్రామంలోకి కరోనా పరీక్షలు చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిని గ్రామస్థులు తరిమి తరిమి కొట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ జిల్లా షాహ్‌నగర్‌ సరౌలా గ్రామంలో వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఓ నవవధువు కూడా వచ్చింది. ఆమె ఆ టైంలో కొంగును కప్పుకొని ఉంది. దీంతో వైద్య  సిబ్బంది ఆమె కొంగును తొలగించమని చెప్పారు. కానీ ఆమె సిగ్గుపడింది. అందుకు కారణం అక్కడే అదే గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్థులు ఉండటమే. అయితే అధికారులు అక్కడ గ్రామస్తును గది వదలి పోవాలని కోరారు.  వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వైద్య సిబ్బందితో ఘర్షణకు దిగారు. అనంతరం వారిపై కొందరు దాడి చేశారు. ఈ క్రమంలో వైద్య  సిబ్బంది అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ గ్రామస్థులు వారిని పరిగెత్తించి కొట్టారు. ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది.

గ్రామస్థుల దాడిలో ఇద్దరు వైద్య సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రులో చేర్పించారు. వైద్య సిబ్బందిని గ్రామస్థులు కొట్టడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి పోలీసులు కూడా చేరుకున్నారు. వైద్య సిబ్బందిపై తప్పుగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేశారు. పరీక్షలు చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దాడులు చేయడం సరికాదని పోలీసులు గ్రామస్థులకు చెప్పారు. ఓ వైపు దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ .. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంది. పరీక్షలు చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి సహకరించడం లేదు.
Tags:    

Similar News