ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్‌లో కరోనాకలకలం

Update: 2020-04-28 20:04 GMT
హైదరాబాద్‌లోని ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్‌లో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఓ సెక్యూరిటీ గార్డుకు పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. అతనితో పాటు అతని తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. అయితే సిబ్బందికి కరోనా సోకిన విషయాన్ని హెరిటేజ్ సంస్థ గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకడంతో మొత్తం ఇక్కడి ఏడుగురు గార్డులను హోమ్ క్వారంటేన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

హోమ్ క్వారంటేన్‌లో ఉండాలని ఏడుగురికి స్టాంప్ కూడా వేశారు. వారిని బయటకు రావొద్దని వైద్యులు సూచించారు. కానీ స్టాంపులు ఉన్న వారు కూడా బయట తిరుగుతుండటంతో స్థానికులు హెరిటేజ్ ప్లాంట్ ముందు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్లాంట్ కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోను కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు 2,000 కేసులు దాటాయి. దేశవ్యాప్తంగా 29,451 కేసులు నమోదయ్యాయి. 939 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 2,12 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు.


Tags:    

Similar News