ఆ ఊరు మొత్తం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయ్యారు

Update: 2016-12-04 16:57 GMT
నమ్మలేకున్నా ఇది నిజం. ఇందులో ఎలాంటి ట్విస్ట్ లేదు. ఒక వ్యక్తి తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇలాంటి అరుదైన పరిస్థితి చోటు చేసుకుంది. నిత్యం పేదరికంతో.. చాలీచాలని సంపాదనతో కిందామీదా పడుతున్న ఆ ఊరి ప్రజలు.. రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావటం ఇప్పుడు వారంతా ఉక్కిరిబిక్కిరికి గురి అవుతున్నారు. ఇదెలాసాధ్యమన్న విషయం తెలుసుకోవాలంటూ.. స్పెయిన్ కు చెందిన ఒక పెద్ద మనిషి గురించి తెలుసుకోవాలి.

స్పెయిన్ లోని కరోనా అనే బీరు కంపెనీకి అంటోనినో ఫెర్నాండేజ్ అనే వ్యక్తి యజమాని. తల్లిదండ్రుల పేదరికంతో చిన్నతనంలో చదువుకునే స్తోమత లేక.. బడికి వెళ్లలేని బ్యాక్ గ్రౌండ్ అతనిది. స్కూల్ కు వెళ్లే ఛాన్స్ లేకపోవటంతో చిన్నతనంలోనే బీర్ కంపెనీలోనే ఉద్యోగిగా చేరాడు. అనంతరం అంచలంచెలుగా ఎదిగి చివరకు భారీ బీర్ ఫ్యాక్టరీలు పెట్టేశారు. భారీగా డబ్బులు సంపాదించినతర్వాత.. తాను పుట్టి పెరిగిన ఊరు ఇంకా మారలేదని.. అక్కడి ప్రజలు పేదరింకతోనే మగ్గుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అతను కలవరం చెందారు.

జీవితం చివరి దశలో ఉన్న ఆయన..తన ఊరికి ఏదో ఒకటి చేయాలని భావించి.. తన తదనంతరం తన ఆస్తిలో పెద్ద మొత్తం తాను పుట్టిన ‘‘సెరిజేల్ డెల్ కాండెడో’’లోనిప్రజలకు చెందాలని కోరారు. అలా వీలునామా రాసిన ఆయన ఈ ఏడాది ఆగస్టులో మరణించారు. అనంతరం.. ఆయన రాసిన వీలునామా ప్రకారం.. ఆ ఊళ్లో ఉన్న 150 కుటుంబాలకు ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.17కోట్ల మొత్తాన్ని జమ అయ్యాయి. రాత్రికి రాత్రి తమ బ్యాంకు అకౌంట్లో ఇంత భారీ మొత్తం రావటంతో షాక్ తిన్న వారు.. ఆరా తీస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది. పుట్టిన ఊరుకోసం.. అక్కడి వారి గురించి ఇంతగా ఆలోచించే వారు ఎవరూ ఉండరేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News