మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 కరోనా కేసులు నమోదయ్యాయని మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,48,874కు చేరింది.
ఇక గడిచిన 24గంటల్లో 3,26,850 బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,511మంది కరోనాతో మరణించినట్లు తెలిపింది. ఇప్పటివరకు 2,40,54,861 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 40 రోజులుగా దేశంలో ప్రతిరోజూ రెండు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా ఒక లక్షా 95 వేల 485 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 ఇండియా ఆర్గనైజేషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మూడు వేల 496 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 14 న దేశంలో తొలిసారిగా రెండు లక్షలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఇక ఇప్పటి వరకు మొత్తం 3,07,231 మంది కరోనాతో చనిపోయారని, ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా 19,85,38,999 మందికి టీకాలు వేసినట్టు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో 20,58,112 మందికి కరోనా పరీక్షలు చేశామని, దీంతో కరోనా పరీక్షల సంఖ్య 33,25,94,176 చేరిందని తెలిపింది.