క‌రోనా ఆ ఊరిని ట‌చ్‌ చేయ‌లేక‌పోయింది!

Update: 2021-05-28 00:30 GMT
క‌రోనా విజృంభ‌ణ‌కు ప్ర‌పంచం మొత్తం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ప‌ల్లె, ప‌ట్నం అనేతేడా లేకుండా జ‌నం మొత్తం భ‌య‌కంపితుల‌వుతున్నారు. ఎటువైపు నుంచి క‌రోనా అంటుకుంటుందో.. ఎవ‌రి నుంచి సంక్ర‌మిస్తుందోన‌ని తీవ్ర‌భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కానీ.. వారికి మాత్రం క‌రోనా చింత లేనేలేదు! అస‌లు ఆ వైర‌స్ గురించి ఆలోచ‌నే లేదు ఆ గ్రామానికి!

ఆ గ్రామం మ‌రెక్క‌డో కాదు.. ప్ర‌కాశం జిల్లాలోని న‌ల్ల‌మ‌ల అభ‌యార‌ణ్యం ప‌రిధిలో ఉంది. అదే.. చింత‌ల గిరిజ‌న‌గూడెం. ఈ గూడెం మొత్తం జ‌నాభా 710. క‌రోనా తొలి ద‌శ నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా అక్క‌డ న‌మోదు కాలేదు. ఇది ఎలా సాధ్య‌మైంది? అన్న ప్ర‌శ్న‌కు వారు చెప్పే స‌మాధానం ఏమంటే.. అంతా ప్ర‌కృతి మ‌హిమ అంటారు!

అవును.. త‌మ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు నాటు వైద్యం త‌ప్ప‌.. ఇంగ్లీష్ వైద్యం తెలియ‌ద‌ని చెబుతున్నారు అక్క‌డి జ‌నం. అంతేకాకుండా.. అడ‌వుల్లో ఔష‌ధ మొక్క‌ల మ‌ధ్య జీవించ‌డం కూడా క‌రోనా బారిన ప‌డ‌క‌పోవ‌డానికి కార‌ణం అని చెబుతున్నారు. చెట్ల వాతావ‌ర‌ణ‌మే ఈ వైర‌స్ ను త‌మ వ‌ర‌కూ రాకుండా అడ్డుకుంద‌ని చెబుతున్నారు.

చిన్న‌ప్ప‌టి నుంచి నాటు వైద్యంతోనే జీవ‌నం సాగిస్తుండ‌డం వ‌ల్ల త‌మ‌లో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగింద‌ని అంటున్నారు. ప్ర‌కృతి మ‌మేక‌మైన త‌మ జీవితాలు.. ప్ర‌శాంతంగా సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు మాస్కు వాడాల్సిన అవ‌స‌ర‌మే రాలేద‌ని అంటున్నారు. అయితే.. బ‌య‌టి జ‌నం మాత్రం వాళ్లు అభ‌యార‌ణ్యంలో ఉన్నారు కాబ‌ట్టే.. బ‌య‌టి జ‌నంతో వాళ్ల‌కు పెద్ద‌గా సంబంధాలు లేవు కాబ‌ట్టే.. వైర‌స్ వ్యాపించ‌లేద‌ని అంటున్నారు.
Tags:    

Similar News