ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం రెడ్ జోన్ లోకి వెళ్ళింది అంటూ ఈ రోజు ఉదయం నుండి ఒక వార్త వైరల్ గా మారింది. అయితే , దీనిపై స్పందించిన గుంటూరు జిల్లా కలెక్టర్ ..అది ఒత్తి పుకారే అని ,జగన్ నివాసం ఉన్న తాడేపల్లి రెడ్ జోన్ లో లేదని ఆయన స్పష్టం చేశారు. నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించామని - తాడేపల్లిలో ఇప్పటివరకు ఒకటే కరోనా కేసు నమోదు అయ్యింది అని తెలిపారు.
పూర్తి వివరాలు చూస్తే .. తాడేపల్లి పాత టోల్ గేట్ సమీపంలోని మారుతి అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వృద్ధురాలు ఇవాళ చనిపోయారు. అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతి చెందిన అనంతరం టెస్టులు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. సీఎం జగన్ నివాసానికి అతి దగ్గర్లోనే ఉండే ఒక అపార్ట్ మెంట్ లో ఆమె నివాసం ఉంటుంది. దీంతో రెడ్ జోన్ పరిధిలోకి సీఎం జగన్ వెళ్ళింది అంటూ పుకారు పుట్టించారు. చివరికి దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ స్పందించి , ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 18 కేసులు నమోదు కావడంతో జిల్లా వాసుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఒకే రోజు 18 కేసులు బయట పడటంతో జిల్లాలో ఇంటి నుండి బయటకి రాకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసారు.