భారతదేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. సెకండ్ వేవ్ లో లక్షల కొద్ది కేసులు , వేల కొద్ది మరణాలు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకి కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతూనేపోతుంది. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒక్క రోజే 4,12,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,980 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకే భారత్ 2,10,77,410 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాలు 23,01,168 నమోదయ్యాయి. ఇక ఒక్క రోజే 3,29,113 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రికవరీ కేసులు 1,72,80,884 ఉన్నాయి. యాక్టివ్ కేసులు 35,66,398 ఉండగా, ఇప్పటి వరకు మొత్తం దేశ వ్యాప్తంగా 16,25,13,339 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే .. దేశంలో కరోనా వైరస్ మూడో దశ రాబోతోందని, దానిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె. విజయరాఘవన్ అన్నారు. దేశంలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమైంది.. అని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయరాఘవన్ మాట్లాడారు. కరోనా మూడో దశ అనివార్యం. ఈ మూడో దశ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం వేరియంట్‌లకు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా కొత్త వేరియంట్లు నమోదవుతున్నాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయని ఆయన అన్నారు.