ఏపీలో జులై 15 నాటికి కరోనా తగ్గుముఖం !

Update: 2021-05-18 09:37 GMT
ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్ ఆర్ ఎం ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరట నిచ్చే కబురు చెప్పారు. జులై 15 నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. జూలై 15 నాటికి రాష్ట్రంలో కరోనా వైరస్  వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎస్‌ ఆర్ ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు మంగళవారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ కు ఈమెయిల్‌ ద్వారా పంపారు.  

ఎస్‌ ఆర్‌ ఎం యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు చొరవతో వర్సిటీ ప్రొఫెసర్‌ సౌమ్యజ్యోతి బిస్వాస్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులు అన్వేష్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి, సాయికృష్ణ, సుహాసిరెడ్డి కరోనా వైరస్  వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ శాస్త్రీయంగా నివేదికను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్‌ ఐఆర్‌ సాయంతో ర్యాండమ్‌ ఫారెస్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ డేటాను తయారు చేశారు. కరోనా వ్యాప్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డేటాను ఎస్‌ ఎస్‌ ఐఆర్‌ డేటాతో అనుసంధానం చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిపై అంచనా గణాంకాలు స్పష్టమవుతున్నాయి. ఇదే పద్ధతిని పాటించిన ఎస్‌ ఆర్‌ ఎం విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్‌ 14 నాటికి 1,000 జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందని, జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్‌ ఆర్‌ ఎం గణాంకాలు చెప్తున్నాయి.
Tags:    

Similar News