దేశంలో కరోనా మహమ్మారి ఇంకా కట్టడిలోకి రాకపోవడంతో ..దేశ వ్యాప్తంగా మరోరెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించిన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే శుక్రవారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వేళ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
దీనితో పాటుగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైరస్ రోగుల చికిత్స ఫీజును కూడా పరిమితం చేసింది. మహాత్మా జ్యోతిబా ఫులే జన్ ఆరోగ్య యోజన పథకం కింద రాష్ట్రంలోని ప్రజలు ఉచిత, నగదు రహిత ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందవచ్చు అని , ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం వంటి పత్రాలు సమర్పించాల్సి వుంటుంది అని, ప్రస్తుతం, ఈ పథకం జనాభాలో 85 శాతం ప్రయోజనం పొందుతున్నారనీ, తాజా నిర్ణయంతో మిగిలిన 15శాతం మందికి కూడా లబ్ధి చేకూరనుందని రాజేష్ తోపే చెప్పారు.
ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, వైట్ రేషన్ కార్డు దారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంతకుముందు 496 ఆస్పత్రులు ఈ పథకంలో ఉండగా, తాజాగా 1,000 కి పైగా ఆస్పత్రులు దీని పరిధిలోకి వస్తాయని ఆయన చెప్పారు. కాగా భారతదేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,000 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం 485 మంది మరణించారు.