తెలంగాణ అవ‌త‌ర‌ణంపై క‌రోనా ఎఫెక్ట్‌?

Update: 2021-06-02 05:30 GMT
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి నేటికి ఏడేళ్లు పూర్త‌య్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్ప‌టిలాగానే సంబురాలు చేసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ రెడీ అయ్యార‌ని అనుకుంటే.. పొర‌పాటే! ఎక్క‌డా ఇప్పుడు ఆ ఊసే లేదు. నిజానికి ఎవ‌రిని క‌దిలించినా.. ఔనా.. ఈ రోజు రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ‌మా? అని నోరెళ్ల బెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ప్ర‌తి ఏటా జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించేవారు.

అయితే.. గ‌త ఏడాది స‌హా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఉద్య మం తాలూకు ఊసులు గుర్తు తెచ్చుకునే ప‌రిస్థితి, రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు కూడా నిర్వ‌హించుకోలే ని దుస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఏటా ప్ర‌భుత్వ‌మే పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మా న్ని నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కానీ, ఈ ఏడాది మాత్రం సైలెంట్‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం. సీఎం కేసీఆర్ అతి త‌క్కువ మంది అధికారులు, నేత‌ల మ‌ధ్య అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని మ‌మ అనిపించేశారు.

ఇక‌, ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే.. య‌థాత‌థంగా వారు లాక్‌డౌన్ స‌మ‌యాన్ని లెక్క పెట్టుకుంటూ.. నిత్యావ‌సరా లు.. ఇత‌ర‌త్రా.. స‌రుకులు కొనుగోలు చేసుకునేందుకు ప్రాదాన్యం ఇచ్చారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల దృష్టి ఇప్పుడు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతోపాటు ఉపాధి కోల్పోవ‌డం, చేతిలో రూపాయి క‌నిపించ‌ని ప‌రిస్తితితో పాటు.. పెరుగుతున్న పెట్రోలు ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లపైనే ఉండ‌డంతో తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం, అవ‌త‌ర‌ణ దినోత్సవం వంటివి పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక పోయాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, సీఎం కేసీఆర్ వైఫ‌ల్యాలు కూడా ప్ర‌స్తుతం రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌పై ప్ర‌భావం చూపించాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలోను, ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను కూడా క‌ట్ట‌డి చేయ‌లేక పోవ‌డం వంటివి.. ప్ర‌ధానంగా వ‌ర్క‌వుట్ అవుతున్నాయ‌ని.. అందుకే తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఏడేళ్ల సంబ‌రం.. ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News