దేశవ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించాయి.
కరోనా కారణంగా మొత్తం బంద్ కావడంతో చిన్న చితకా ఉద్యోగులు, రోజువారీ కూలీలు, వ్యాపారులు పనులు లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతో వ్యక్తులు, కంపెనీలు సైతం కట్టాల్సిన ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్రం వెసులుబాటు కల్పించాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ కేంద్రాన్ని, ఆర్బీఐని కోరింది. బ్యాంకులకు చెల్లించాల్సిన లోన్స్, క్రెడిట్ కార్డు బిల్లుల విషయంలో సడలింపు ఇవ్వాలని కోరింది.
కాగా దీనిపై అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో వేతన జీవులకు ఊరట లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.