తాజాగా బహ్రెయిన్ లో పనిచేస్తున్న మరో ఇద్దరు భారతీయ నర్సులకు కరోనా వైరస్ సోకింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కసారగాడ్ కు చెందిన ఇద్దరు నర్సులు బహ్రెయిన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారిద్దరిని వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం చేస్తున్న క్రమంలో వారికి కూడా వైరస్ సోకిందని డాక్టర్లు తెలిపారు. వారి బంధువులకు కూడా రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నర్సులు కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరితో కలిపి బహ్రెయిన్ లో కరోనా బారినపడ్డ భారతీయ నర్సుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, బహ్రెయిన్ లో ఇప్పటి వరకు 195 మందికి కరోనా సోకింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1.26 లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 4,600 మంది మృత్యువాత పడ్డారు.