కరోనాతో గుండెకు కూడా ప్రమాదమే..! ఈ లక్షణాలు ఉంటే డాక్టర్​ ను కలవండి..!

Update: 2021-05-22 23:30 GMT
కరోనా వైరస్​ ఊపిరితిత్తుల మీద మాత్రమే కాక.. గుండె మీద కూడా ప్రభావం చూపుతుందని గతంలోనే శాస్త్రవేత్తలు చెప్పారు. నిజానికి కరోనా వైరస్​ ఎక్కువగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మందికి ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోతుంటాయి. ఇందువల్లే మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్నాక చాలామందిలో గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి. దీంతో డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.కరోనా సెకండ్​ వేవ్​ లో చాలా మంది కరోనా బాధితులు గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి కరోనాకు చికిత్స తీసుకున్న తర్వాత గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

యువకుల్లో కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలా మంది శ్వాససంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. చాతిలో నొప్పి, ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోవడం వంటి లక్షణాలతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.కరోనా నుంచి కోలుకున్నాక ఎవరికైనా చాతి లో నొప్పి.. ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకుండా వెంటనే డాక్టర్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలా మంది బలహీనంగా కనిపిస్తున్నారు. తరచూ నీరసంగా ఉంటోందని అంటున్నారు.కరోనా వైరస్​ వల్ల రక్తం గడ్డకట్టడం వంటి సమస్య ఏర్పడుతుందని .. ఇది చాలా ప్రమాదకరమని డాక్టర్లు సూచిస్తున్నారు. చాతి బిగుతుగా ఉండటం, నరాల బలహీనత, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. విపరీతంగా చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ను కలవాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News