కరోనా ముగియనే లేదు.. మళ్లీ ఉపద్రవం.. WHO హెచ్చరిక

Update: 2022-12-13 11:00 GMT
21వ శతాబ్ధంలో మనిషిపై వైరస్ ల దాడి ఎక్కువైంది. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మళ్లీ ఫ్లూలు భయపడెతున్నాయి. కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని లాక్ డౌన్ పాలు చేసింది. అందరినీ ఖాళీగా ఇంట్లో కూర్చుండబెట్టి నరకం చూపించింది. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మరణించారు. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయిన వైనాలు చూశాం. ఎంతో మంది అనాథలయ్యారు. ఈ ఫ్లూ జాతి వైరస్ దాని వ్యాధి కారకాలు పెంచుకుంటూ వెళ్లింది. చైనా లాంటి చోట్ల ఇంకా తగ్గడం లేదు. అత్యధిక వేగంతో వ్యాపిస్తూనే ఉంది.

ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నామని ప్రపంచ దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) బాంబు పేల్చింది. వైరస్ ల వ్యాప్తి, కట్టడిపై పలు దేశాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని.. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పలు రకాల వైరస్ లు, వ్యాధి కారకాలు అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ముఖ్యంగా కరోనా, ఫ్లూతోపాటు ఇతర వ్యాధి కారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. పౌరులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించింది.

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. కరోనా, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్ లతోపాటు ఇతర వ్యాధి కారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని.. వ్యాక్సిన్ లు వేసుకోవాలని.. మాస్కులు, భౌతిక దూరం, వెంటిలేషన్, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారినపడితే ఇంటి దగ్గరే ఉండడం, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూ.హెచ్.వో సూచించింది. ముప్పును ముందే తెలుసుకోవడం ద్వారా వాటి తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొంది.

మొదట్లో కొవిడ్ ప్రాథమిక లక్షణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్నింటిని మాత్రమే పేర్కొంది. కానీ ఇందులో చాలా మార్పులు చేసింది.  కొందరిలో తీవ్రమైన అలసట, గుండె దడ, చెవులు నిరంతరం మోగడం, పాదల నొప్పి,ఆహారం మింగడానికి కష్టంగా మారడం వంటి లక్షణాలు కూడా కొవిడ్ బాధితుల్లో ఉన్నాయి. అయితే ఇవి కొవిడ్ ప్రారంభమైన రోజుల్లో లేకపోయినా ఆ తరువాత అది చూపిన ప్రభావంతో ఇలాంటి లక్షణాలు దరిచేరాయి. ఇలా బాధపడడం కూడా జాగ్రత్తపడాలని వైద్యులను సంప్రదించాలని పేర్కొంది.

ముఖ్యంగా చలికాలంలో ఫ్లూలు భయపెడుతున్నాయి. కొత్తగా రూపాంతరం చెందుతున్నాయి. ఇలా కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతూ మనుషులను భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనాతో లక్షల మంది చనిపోయారు. ఇక దాని తర్వాత 'మంకీపాక్స్ భయపెడుతోంది. ఇప్పుడు కొత్త గా డిసీజ్ X వ్యాధి  సోకుతోంది. ఇది ప్రాణాంతకం అనేది కూడా తెలియదు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News