కర్నాటకలో ఘోరం: ఆస్పత్రి భవనం నుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య
కరోనా వైరస్ సోకితే బాధితులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తమకు మహమ్మారి సోకడంతో ఇక చావేనని భయపడుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. తాజాగా కర్నాటకలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో సోమవారం చోటు చేసుకుంది.
ఏప్రిల్ 24వ తేదీన కరోనా సోకిందని గుర్తించి 54 ఏళ్ల వ్యక్తిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ కోలుకున్నాడు. అయితే ఆయనకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించలేదు. కరోనా నుంచి కోలుకున్నాడని నిర్ధారించారు. అతడికి మూత్రపిండ సమస్యలు ఉండడంతో ఆస్పత్రి వారు ఐసీయూకు మార్చారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆస్పత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలియరాలేదు. కరోనాకు భయపడా? లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం కర్ణాటకలో కరోనా వైరస్ కొంత మేర ప్రభావం చూపుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 511 పాజిటివ్ కేసులు ఉండగా, 19 మంది మృతిచెందారు.