భారత్ లో కరోనా వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వైరస్ అందరికీ సోకుతుంది. భారత్ లో కొత్తగా 1.80 లక్షల కేసులు వెలుగు చూశాయి. మరో వైపు మరణాలు తగ్గడం కొంచెం ఉపశమనాన్ని ఇస్తుంది. ఈసారి వైరస్ బారిన పడే వారిలో ఎక్కువమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది ఎక్కువుగా ఉన్నారు. కరోనా మొదటి, రెండో వేవ్ లతో పోల్చితే ఈ సారి ఎక్కువ మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా విజృంభిస్తున్న మహారాష్ట్రలో పోలీసులు భారీ సంఖ్యలో కొవిడ్ బారిన పడ్డారు. మరో వైపు దిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో 44 వేల కేసులు నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. సుమారు 19 వేల కేసులు ఒక్క ముంబైలోనే బయటపడ్డాయి. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పోలీస్ శాఖలో కూడా వైరస్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పేరుతుందని డిపార్ట్ మెంట్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే పోలీసు
ఉన్నతాధికారులతో పాటు వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు 132 మందిలో వైరస్ నిర్ధరణ జరిగినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ముంబైలోని ఉన్నట్లు పేర్కొన్నారు. మరో వైపు దిల్లీలో కూడా కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 22 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో చాలా మంది పోలీసులు కూడా వైరస్ బారిని పడ్డారు. పోలీసు శాఖలలోని ఉన్నతాధికారులు, ప్రజా సంబంధాల అధికారి కూడా ఉన్నారు. ఇలా వివిధ స్థాయిల్లో ఉన్న సుమారు 1000 మంది పోలీసులు వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడిన వారిలో దిల్లీ పోలీసు అధికారి చిన్మయి బిశ్వాల్ కూడా ఉన్నారు. వైరస్ సోకిన పోలీసులు అధికారులు అంతా కేవలం క్వారంటైన్ కు పరిమితం అయినట్లు శాఖాధికారులు తెలిపారు.