కరోనా కోరలు చాస్తోంది. అందరికీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఫీల్డ్ లో ఉండే పోలీసులు, వైద్యసిబ్బంది, జర్నలిస్టులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. వరుసగా వివిధ మీడియాల్లోని జర్నలిస్టులు తాజాగా కరోనా బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పాపులర్ కమెడియన్, టీవీ యాంకర్ బిత్తిరి సత్తి కూడా కరోనావైరస్ బారినపడ్డారు. తాజాగా ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది.
బిత్తిరి సత్తి ఇటీవల టీవీ9లో మానేసి సాక్షి టీవీలో చేరాడు. ప్రస్తుతం "గరం గరం" అనే పేరుతో కొత్త సెటైరికల్ ప్రోగ్రాంను ప్రారంభించాడు. ఒక వారం టెలికాస్ట్ చేసిన తరువాత తాజాగా కరోనా పాజిటివ్ గా తేలాడు. ప్రస్తుతం బిత్తిరి సత్తి హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం మీడియాలో సాంకేతిక నిపుణులు.. కళాకారులు క్లోజ్డ్ స్టూడియో వాతావరణంలో షూటింగ్ చేయాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో వేగంగా కరోనావైరస్ బారిన పడుతున్నారు. అంతేకాక, తెలుగు న్యూస్ మీడియా కరోనా కేసులకు హాట్‌స్పాట్‌లుగా మారింది.
సాక్షి టీవీలో తొలిసారిగా బిత్తిరి సత్తి తన బలాన్ని నిరూపించుకున్నారు. మొదటి వారపు కార్యక్రమం ఛానెల్ ప్రోగ్రామ్‌లలో ఏకంగా మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు కరోనా బారిన పడడంతో 14 రోజుల వరకు సత్తి ప్రోగ్రాం చేసే అవకాశాలు కనిపించడం లేదు.