దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వాప్యారవేత్తలు కరోనా బారిన పడ్డారు. ఇకపోతే , తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఓ మంత్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.