అందరూ అనుకున్నదే జరిగింది. విద్యార్థుల భవిష్యత్ కి మంచిది కాదు అంటూ స్కూళ్లు భయపడుతూనే తెరచారు. సెకండ్ వేవ్ కరోనా తగ్గుముఖం పడ్డటం తో దేశంలోని పలు రాష్ట్రాలు స్కూళ్లు ఓపెన్ చేశారు. కొవిడ్ నిబంధనలతోనే స్కూళ్లు ఓపెన్ చేశారు. అయితే , నిబంధనలు ఎంత బాగా పాటించినా మహమ్మారి నేనున్నా అంటూ వచ్చింది. ఏపీలో కూడా ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలల గేట్లు తెరుచుకున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య.. కొందరు పేరెంట్స్ టెన్షన్‌లో ఉన్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. చిన్నారులపై వైరస్ ప్రభావం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మళ్లీ పున:ప్రారంభం అవ్వడంతో.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.
తాజాగా.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో నిర్వహించిన టెస్టుల్లో.. 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పెదపాలపర్రు జడ్పీ హైస్కూల్లో 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అదే విధంగా మరో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులకు కూడా కరోనా సోకింది. అలెర్టయిన విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్కూల్ మూసివేసి సెలవు ప్రకటించారు. స్కూల్ మొత్తం శానిటైజ్ చేయిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా ఆదేశాలిచ్చారు.
విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. 10 మందికి పాజిటివ్ గా తేలిందని ముదినేపల్లి ఎంఈవో నరేష్ చెప్పారు. అందరినీ హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా విద్యార్థులకూ టెస్టులూ చేయిస్తామని తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని చెప్పారు.మరో పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి సైతం కరోనా బారినపడ్డాడు. అతన్ని కూడా హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. విద్యా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం మరికొన్నాళ్లు స్కూళ్లు తెరుచుకోకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశముంది. అందుకే ఏపీ సర్కారు ఈ విషయంలో ముందడుగేసి స్కూళ్లు, కాలేజీలు తెరిచింది. అయితే కృష్ణా జిల్లా ఘటన ఒక్కసారిగా అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తల కంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది.