'టీకా' తీసుకున్నా ఆ మంత్రికి కరోనా సోకిందట..ఎవరంటే?

Update: 2021-03-16 07:15 GMT
కరోనా వైరస్ .. ఏ ముహూర్తాన ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిందో కానీ, ఆ క్షణం నుండి యావత్ ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. ఓ సమయంలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది అని అనుకుంటున్న సమయంలో కరోనా మళ్లీ తన మునుపటి ఫామ్ అందుకొని ప్రపంచాన్ని భయపెడుతుంది. ఇక దేశంలో గతంలో కొద్ది రోజుల వరకు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా కూడా , ఈ మద్య మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

సామాన్యులతో పాటుగా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులకు కూడా కరోనా సోకుతున్నది.  తాజాగా, గుజరాత్ క్రీడాశాఖ మంత్రి ఈశ్వర సింగ్ పటేల్ కరోనా బారిన పడ్డారు. ఈనెల 13 వ తేదీన మంత్రి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వ్యాక్సిన్  తీసుకున్నా తర్వాత కరోనా పాజిటివ్ గా తేలడంతో  గుజరాత్ ప్రభుత్వం దీనిపై కొంచెం అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం మంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని లేదంటే కరోనా బారిన పడక తప్పదని మరోసారి రుజువైంది. 
Tags:    

Similar News