అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో కరోనా కలకలం

Update: 2020-04-30 14:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వెయ్యిన్న‌ర‌కు చేరువ‌లో కేసులు ఉన్నాయి. ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం క‌ట్ట‌డి కావ‌డం లేదు. అయితే తాజాగా అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఐజీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావ‌డంతో ఆ క‌ళాశాల‌లో అంద‌రిలోనూ ఆందోళ‌న మొద‌లైంది. ఐజీ కుమారుడు నెల కింద‌ట కెనడా నుంచి అనంతపురముకు వచ్చాడు. అతడికి ప‌రీక్ష‌లు చేయ‌గా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆ యువ‌కుడిని ఆస్పత్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు తరలించారు.

ఐజీ కుమారుడికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లాలో కలకలం రేగింది. అనంతపురము జిల్లాలో క‌రోనా కేసులు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం జిల్లాలో మూడు కేసులు కొత్తగా నమోదు కాగా వారిలో ఐజీ కుమారుడు ఒక‌డు. కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపింది. యువకుడు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఐజీ కుటుంబసభ్యులందరూ పరీక్షలు చేయించుకున్నారు. యువకుడికి కరోనా ఎలా సోకిందో తెలియాల్సి ఉంది. యువకుడు ఏయే ప్రాంతాలలో తిరిగాడనే వివరాలను, అతడి సన్నిహితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,403కు చేరిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News