స్కూల్‌ డుమ్మా కోసం లెమన్.. వెనిగర్ తో కరోనా పాజిటివ్‌

Update: 2021-07-04 10:38 GMT
ప్రపంచ వ్యాప్తంగా జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో దాన్ని కొందరు క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు కరోనా వల్ల జనాలు చనిపోతూ ఉంటే మరో వైపు కరోనాతో వ్యాపారం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక యువత కొందరు కరోనాతో కామెడీ చేస్తున్నారు. కరోనాపై ఫన్నీ మీమ్స్ క్రియేట్‌ చేయడంతో పాటు కరోనాను ఉపయోగించి రకరకాలుగా ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో యూకే కు చెందిన విద్యార్థులు కొందరు స్కూల్ కు డుమ్మా కొట్టేందుకు గాను ఫేక్ కరోనా టెస్ట్‌ రిపోర్ట్ ను తయారు చేస్తున్నారట. కరోనా నిర్థారణ కోసం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లోనే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ టెస్టు లో పాజిటివ్ వచ్చేందుకు రకరకాలుగా మార్గాలు ఉన్నాయని టిక్ టాక్ లో చూపిస్తున్నారు.

కరోనా టెస్టింగ్ కిట్ లో నిమ్మరసం లేదా వెనిగర్ డ్రాప్ వేయడం వల్ల కరోనా పాజిటివ్ రిపోర్ట్‌ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు బ్రిటన్ యువకులు మరియు పిల్లలు తమకు కరోనా రాకున్నా కూడా స్కూల్‌ లేదా ఆఫీస్ ఇతర విధులను తప్పించుకునేందుకు పాజిటివ్‌ డ్రామా ఆడుతున్నారట. ఈమద్య చాలా మంది ఇలా చేయడం వల్ల స్థానిక అధికారుల దృష్టికి వచ్చిందట. దాంతో వారు చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యారని సమాచారం అందుతోంది.

కోవిడ్‌ టెస్టుల విషయంలో వారు చేస్తున్న పనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో చూస్తూ ఇలాంటి ఫేక్‌ రిపోర్ట్ లను తయారు చేస్తున్న యువకులు ముందు ముందు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. మహమ్మారిని ఇలా ఫన్నీ గా ఉపయోగించుకోవడం సబబు కాదంటూ కొందరు సూచిస్తున్నారు. ఈ కథనాలు ఎక్కువగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి ఫేక్ రిపోర్టు లు పుట్టుకు వస్తాయేమో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా కరోనా వంటి మహమ్మారితో ఇలాంటి ఆటలు ఏమాత్రం సబబు కాదు.
Tags:    

Similar News