కరోనా తీవ్రత: హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2021-04-08 07:42 GMT
తెలంగాణలో కరోనా తీవ్రత, తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు గాను తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.  టీఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని ప్రభుత్వానికి సూచించింది.

తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని స్పష్టం చేసింది.

ఇక తెలంగాణలో సినిమా థియేటర్లు, క్లబ్బులు, పబ్బులపై ఆంక్షలు విధించాలని హైకోర్టు సూచించింది. వందమంది ఉద్యోగులున్న ఆఫీసుల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం గురువారం హైకోర్టుకు సమర్పించింది. దీనిపై విచారించిన హైకోర్టు కఠిన చర్యలు తీసుకొని కరోనాను అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముఖ్యంగా కేంద్రం నిర్ధేశించిన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని.. మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని కోరింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కరోనాను అరికట్టాలని సూచించింది.
Tags:    

Similar News