ప్రధాన మీడియా ఆఫీసులో మళ్లీ కరోనా టెన్షన్

Update: 2021-03-12 08:30 GMT
మీడియాలో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. గత మార్చిలో కరోనా-లాక్ డౌన్ తో అన్నింటికంటే దెబ్బ పడింది మీడియా రంగంపైనే.. తెలుగులోని అగ్ర పత్రికలు, మీడియా చానెల్స్ అన్నీ కూడా కుదించుకొని జర్నలిస్టులను ఇంటికి పంపారు. రికవరీ అయితే తీసుకుందామని ఏడాదిగా ఎదురుచూస్తున్నా.. అది రికవరీ కావడం లేదు. జర్నలిస్టులకు ఉద్యోగాలు తిరిగి రావడం లేదు.

ఈ క్రమంలోనే మీడియాలో బాబ్స్ పెద్దఎత్తున పోతున్నాయి. ఇటీవల ఓ ప్రధాన పత్రిక ఏడాదిగా జీతాలు ఇవ్వడం లేదని జర్నలిస్టులు అంతా కలిసి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి ఉంది.

మీడియాలో జాబ్స్ కోత ఇంకా కొనసాగుతోంది. అధికార పార్టీల పత్రికల్లోనూ ఇటీవల పదుల సంఖ్యలో జర్నలిస్టులను తొలగించిన వైనం జర్నలిస్టుల సర్కిల్స్ లో కలకలం రేపింది. మీడియాలో జాబ్స్ పెద్ద ఎత్తున పోతున్నాయి. కరోనా వల్ల ఆదాయం తగ్గింది.. మళ్లీ ఇప్పుడు కరోనా విజృంభించడంతో ఆ ప్రభావం మీడియాపై భారీగా పడుతోంది.

తాజాగా ఓ ప్రధాన మీడియా ఆఫీసులో కరోనా కల్లోలం సృష్టించింది. గత ఏడాది మార్చిలో కరోనా ఎంట్రీ సమయంలో ప్రతి మీడియా సంస్థలో ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. అంతా సద్దుమణిగిన  ఈ టైంలో మరోసారి కరోనా విజృంభించింది. తాజాగా ప్రధాన మీడియా ఆఫీసులో కరోనాతో ఏకంగా 20మంది అస్వస్థతకు గురయ్యారన్న వార్త మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.కరోనాను లైట్ తీసుకొని ఫ్రీగా తిరగడం వల్లే ఇలా మళ్లీ కరోనా ప్రబలుతోందని.. మహారాష్ట్రలో కేసులు పెరిగాయని.. ఇప్పుడు హైదరాబాద్ లోనే అదే నిర్లక్ష్యంతో కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.

గతంలో ఆ ప్రధాన మీడియాలో కరోనా దెబ్బకు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది ఆ సంస్థ. కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లకు సాగనంపింది. అరకొర స్టాఫ్ తో నెట్టుకొస్తున్న సంస్థలో ఇప్పుడు కరోనా కల్లోలంతో మరింత దెబ్బ తీసినట్టైంది. 20 మంది కరోనా బారినపడడం.. వారితో కాంటాక్టులో ఉన్నవారు క్వారంటైన్ లోకి వెళ్లడంతో అతితక్కువ సిబ్బంది ఆ చానెల్ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News