కరోనా వైరస్ మరణాల రేటు తక్కువగా నమోదు అయ్యిందని, ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ సమయంలో ప్రశంసలు అందుకున్న కేరళ, ఈ సారి కరోనా మహమ్మారి కి హాట్ స్పాట్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ రికార్డ్స్ సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన వివరాల ప్రకారం.. కేరళలో ఏకంగా 22 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీదా దాదాపు 43 వేల కేసులు నమోదు కాగా, అందులో ఏకంగా 50 శాతానికి మించిన వాటా కేరళదే కావడం గమనార్హం.
ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి మధ్య స్థాయి కేసులు నమోదైన రాష్ట్రాల్లో కూడా ఈ వారంలో కేసుల సంఖ్య మరింత తగ్గుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు 1500 స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. అయితే గత కొన్నాళ్లుగా కేసుల సంఖ్యను పెరుగుతున్న కేరళలో మూడో వేవ్ దాదాపు దాదాపుగా ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే దేశంలో సెకెండ్ వేవ్ కూడా ఇలా ఒక రాష్ట్రం నుంచినే ప్రబలింది. అప్పుడు మహారాష్ట్ర లో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలోనే మహారాష్ట్రలో పది వేలు, ఇరవై వేల స్థాయిలో కేసులు నమోదవుతూ వచ్చాయి.
ఆ తర్వాత క్రమంగా దేశమంతా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఆ సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందిప్పుడు. కేరళలో కూడా అలానే కేసుల సంఖ్య తగ్గింది. కానీ పెద్దగా సమయం లేకుండానే, ఇప్పుడు అక్కడ రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 20 వేలను దాటేయడంతో ఇక నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారుతోందిజ. కేరళలో ఇలానే కేసుల సంఖ్య పెరుగుతూ పోతే.. మూడో వేవ్ దాదాపు ప్రారంభం అయినట్టేనా, అది ప్రారంభం అయితే మూడో వేవ్ ఒట్టి కేరళతోనే ఆగుతుందా, ఇతర రాష్ట్రాలకు ఈ వేవ్ పాకుతుందా, లేక వైరస్ కొత్త వేరియెంట్ ఏదైనా ఇలా మళ్లీ కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోందా, అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.
అయితే ఇప్పుడు కేరళ లో కేసులు పెరగడం విషయంలో అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత ధోరణి కూడా ఒక కారణంగా నిలుస్తోంది. బక్రీద్ అంటూ అక్కడ ఫుల్ రిలాక్సేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ సంబరాల ప్రభావమే ఇప్పుడు కేరళలో కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమా, అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దేశంలో నిన్న కొత్తగా 43,654 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,84,605కు చేరింది. అలాగే, నిన్న 41,678 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే నిన్న 640 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,22,022కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,63,147 మంది కోలుకున్నారు. 3,99,436 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 44,61,56,659 వ్యాక్సిన్ డోసులు వేశారు.