ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. మంగళవారం కూడా అదే జోరు కొనసాగింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75465 టెస్టులు చేయగా దాదాపు 10వేల కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 5.50 లక్షలు దాటేశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,57,587 కు పెరిగాయి.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 75వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారంతో తూ.గోదావరిలో అత్యధికంగా ఏకంగా 1398 కేసులు నమోదయ్యాయి.
తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీత సైతం కరోనా బారినపడ్డారు. ఏపీలో వైసీపీ ఎంపీగా ఉన్న గీతకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయ్యింది.
అయితే స్వల్ప లక్షణాలే కావడంతో వంగ గీతను హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇటీవల ఆమె కాకినాడ ఎంపీ పరిధిలో పర్యటించారు. ఈ క్రమంలోనే సోకినట్టు తెలుస్తోంది.