కరోనా కబళిస్తోంది. వరుసగా ప్రముఖులను ఆవహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఎక్కువశాతం మందికి సోకుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
కేంద్రంలో వరుసగా కేంద్రమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఐదారుగురు కేంద్రమంత్రులు కరోనా బారినపడ్డారు.
ఏపీలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకి కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాజకీయ నాయకులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కృష్ణ జిల్లాకు చెందిన నూజీవీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు కరోనా అని నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని.. ఎమ్మెల్యే ప్రతాప్ తెలిపారు. ఇక వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు హోం క్వారంటైన్ లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.