భారత్ లో కరోనా: 17265 కేసులు..543మంది మృతులు

Update: 2020-04-20 06:50 GMT
భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజులోనే ఏకంగా దేశవ్యాప్తంగా 1324 కేసులు.. 31 మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశంలో ఇప్పటివరకు 17265 కేసులు నమోదైనట్టు భారత వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో కరోనాతో 543మంది మరణించారని తెలిపింది. 14175 యాక్టివ్ కేసులున్నాయని.. 2547మంది కోలుకున్నారని తెలిపింది.

ప్రధానంగా దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. అత్యధిక మరణాలు మహారాష్ట్రలో 223 సంభవించాయని తెలిపింది. 4203 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయని తెలిపింది..

*తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్డడం లేదు. ఆదివారం మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరింది. మొత్తం తెలంగాణ లో కరోనా కారణంగా ఇప్పటి వరకు 21మంది చనిపోయారు. 186మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నాడు.

*ఏపీలో పెరుగుతున్న కరోనా
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 17మంది మరణించారు. 65మంది డిశ్చార్జ్ అయ్యారు.

*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 165000 దాటింది.  అమెరికాలో కరోనా మరణాలు తగ్గాయి. అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.64 లక్షలు దాటింది. 40565మంది ఇప్పటివరకు చనిపోయారు.
Tags:    

Similar News